ఏఐ ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే కఠిన చర్యలు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాసానిపల్లి గ్రామంలో చిరుత పులి సంచరించినట్లు తెలిసినట్లు నాగిరెడ్డిపేట్ ఫారెస్ట్ ఎఫ్ఆర్వో వాసుదేవ్ తెలిపారు. అట్టి సమాచారం మేరకు మాసానిపల్లి గ్రామంలో చిరుతపులి సంచరించిన ప్రాంతానికి ఫారెస్ట్ ఎఫ్ఆర్వో వాసుదేవ్ సిబ్బందితో కలిసి వెళ్లి చుట్టు ప్రక్కల ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీ చేసిన పిదప ఎలాంటి ఆనవాళ్లు లభ్యం కాలేవని ఎఫ్ఆర్ఓ వాసుదేవ్ తెలిపారు.
అయితే గ్రామానికి చెందిన ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఏఐ టెక్నాలజీతో చిరుత పులి ఫోటోలు క్రియేట్ చేసి చిరుత పులి సంచరిస్తున్నట్లు మాసానిపల్లి వాట్సప్ సోషల్ మీడియా గ్రూపులో పోస్టులు పెడుతూ గ్రామస్తులను భయం బ్రాంతులకు గురి చేయడం జరిగింది.ఇట్టి విషయంపై ట్రాక్టర్ డ్రైవర్ను విచారించి ట్రాక్టర్ డ్రైవర్ ఫోను మొత్తం పూర్తిగా తనిఖీ చేయగా అది ఏఐ చిత్రంగా గుర్తించడం జరిగిందని ఎఫ్ఆర్ఓ వాసుదేవ్ తెలిపారు.
ఈ విధంగా ఏఐ టెక్నాలజీతో ఫోటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేసి ప్రజలను భయం బ్రాంతులకు గురిచేసిన వారిపై చట్టరీత్యా కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్దపట్లోళ్ల సునంద కిషన్ రెడ్డి,మాజీ సర్పంచ్ వరిగే విట్టల్,ఎఫ్ఆర్వో వాసుదేవ్,పంచాయతీ కార్యదర్శి సుభాష్ రెడ్డి, గ్రామ పెద్దలు సంగయ్య, యువకులు తదితరులు ఉన్నారు.