పోక్సో చట్టంపై అవగాహన

24-10-2026 | 03:49pm

దమ్మపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్, దమ్మపేట జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బీ.భవాని(Dampeta Judicial First Class Magistrate B.Bhavani) ఆధ్వర్యంలో ఫోక్సో నేరాలు, ఇతర చట్టాలపై పిల్లలు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న అంశాలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జడ్జి బి.భవాని మాట్లాడుతూ... సమాజంలో ధైర్యంగా ఎలా ఉండాలి. కఠినమైన పరిస్థితిని ఎలా ఎదుర్కొనాలి, అసభ్యంగా ప్రవర్తించిన వారిపై ఎలా కంప్లైంట్ ఇవ్వాలి. చట్టంలో ఎవరైనా ఇబ్బంది పడితే వారు హెల్ప్ లైన్లు ఉపయోగించుకొని కంప్లైంట్ చేయాలని సూచించారు. పిల్లల్ని వేధించే వారు ఎవరైనా ఉంటే ఆ విషయాన్ని పిల్లలు దాచి పెట్టకుండా సంబంధిత పెద్దలకు లేదా పోలీస్ వారికి తెలియజేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట, దమ్మపేట ఎస్ఐలు, మండల విద్యాధికారి, దమ్మపేట జెడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు, దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు గొంది మురళీమోహన్, జనరల్ సెక్రెటరీ లక్కినేని నరేంద్రబాబు, ఉపాధ్యక్షులు ముప్పిడి శ్యామ్ సుధాకర్, గోళ్ల భవాని కృష్ణ యాదవ్, తామ బాలరాజు,మహిళ న్యాయవాది కాలం సంధ్యారాణి, కోర్టు సిబ్బంది, లీగల్ సర్వీస్ అథారిటీ సిబ్బంది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు