విద్యుత్ పొదుపు మాటలకేనా
ప్రభుత్వ ఆసుపత్రిలో పగటిపూట వెలుగుతున్న లైట్లు
బెజ్జంకి: విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని ప్రభుత్వం సూచిస్తుంటే.. ఆచరణలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బెజ్జంకి ప్రభుత్వ ఆసుపత్రి(Bejjanki Government Hospital)లో శనివారం ఉదయం 10 గంటల సమయంలో లైట్లు వెలుగుతుండటం చర్చనీయాంశంగా మారింది.
వైద్య సేవలందించే ప్రభుత్వ ఆసుపత్రుల్లో విద్యుత్ వినియోగంపై సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. పగటిపూట తగినంత వెలుతురు ఉన్నచోట అవసరం లేకున్నా లైట్లు వెలిగించడం వల్ల విద్యుత్ వృథా అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వమే పొదుపు పాటించాలని చెబుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల్లోనూ ఆచరణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.