6 September, 2026 | 3:31 PM

ప్రజలకు బాకీ కార్డుల పంపిణీ

06-09-2026 | 01:10pm

జగదేవపూర్,(విజయ క్రాంతి): జగదేవపూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగరాజు ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్ లో బాకీ కార్డ్( Baaki Cards) పంపిణీ  కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) ఎన్నికల్లో ఇచ్చిన హామీలను  నెరవేర్చ లేదంటూ ప్రజలకు ప్రభుత్వం బాకీ ఉన్న వివరాలతో కూడిన కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుద్ధ నాగరాజు,మాజీ ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి లు   మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు గడుస్తున్న ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు.

కెసిఆర్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమి లేదని ప్రజలు మళ్లీ కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నెరవేర్చాలని కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ధర్నాలు రాస్తారోకోలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మచ్చ గణేష్ వార్డ్ సభ్యులు మచ్చ బాబు, బచ్చలి భాస్కర్, బండ శ్రీనివాస్,డప్పు సాయి,బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు దాచారం కనకయ్య కొంపల్లి మహేష్,ప్రశాంత్,బాల కృష్ణ,నాగరాజు నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు