కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని పాదయాత్ర
గజ్వేల్, అక్టోబర్ 3 : మాజీ సీఎం కేసీఆర్(KCR) మళ్లీ ముఖ్యమంత్రి(Chief Minister) కావాలని కోరుతూ మంథని నియోజకవర్గం(Manthani Constituency) నుంచి గజ్వేల్(Gajwel) వరకు పాదయాత్ర చేపట్టిన బెన్నీ పాల్, వెంకటేష్, కొండా వెంకటేష్‌లను గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి(Vanteru Pratap Reddy) శాలువాలతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలతో ప్రజలకు ఇచ్చిన హామీల అమలును విస్మరించిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్‌పై అభిమానంతో మంథని నుంచి గజ్వేల్ వరకు ముగ్గురు యువకులు పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు.
రైతులకు సాగునీరు, విద్యుత్ సక్రమంగా అందక పంటలు ఎండిపోతున్నాయని వంటేరు ఆరోపించారు. గోదావరిలో వరద జలాలు వృథాగా పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థులు, యువత, మహిళలు, వృద్ధులు, రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా డైవర్షన్ రాజకీయాలు మానుకుని రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.