5 September, 2026 | 11:34 PM

మంచిర్యాలలో బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ

05-09-2026 | 10:10pm

మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): ఫీజు రియంబర్స్ మెంట్(Fee Reimbursement), యూత్ డిక్లరేషన్, జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి శని వారం మంచిర్యాల జిల్లా(Mancherial District) కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. బెల్లంపల్లి చౌరస్తా నుంచి వెంకటేశ్వర చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్, మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, BRSY రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ లు కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, BRSY, TBGKS, BRS నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు