16 August, 2026 | 7:57 PM

Districts - Mancherial

article_79263876.webp
ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేత

మంచిర్యాల, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలోని పలు శాఖలలో విధులు ఉత్తమంగా నిర్వహించిన 90 మంది అధికారులు, ఉద్యోగులకు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు శని వారం బెల్లంపల్లి ఎంఎల్ఏ గడ్డం వినోద్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్, కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, డీసీపీ ఎగ్గడి భాస్కర్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ ఆలీ, జిల్లా అధికారులతో కలిసి ప్రశంసా పత్రాలు అందజేశారు.

15-08-2026

article_80450159.webp
జీఎం కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

నస్పూర్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయంలో శని వారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా మనకు ఈ స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. సింగరేణి దేశంలోనే మరే ప్రభుత్వరంగ సంస్థ కల్పించనన్ని సంక్షేమ పథకాలు కల్పిస్తూ ఒక ఉపాధికల్పన కేంద్రంగా కొనసాగుతోందన్నారు. ఈ ఏడాది కంపెనీ స్థాయిలో, ఏరియా స్థాయిలో నిర్దేశిత లక్ష్యాలను రక్షణతో సాధించేలా సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి సారధ్యంలో, డైరెక్టర్ల నిరంతర పర్యవేక్షణలో ముందుకు సాగుతున్నామన్నారు.

15-08-2026

article_63667776.webp
బెటాలియన్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

హాజీపూర్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని 13వ ప్రతేక పోలీస్ బెటాలియన్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బెటాలియన్ కమాండెంట్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శని వారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండావిష్కరించిన అనంతరం కమాండెంట్ మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల త్యాగాలను కమాండెంట్ ప్రత్యేకంగా స్మరించుకున్నారు. వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ నిబద్ధతతో సేవలు అందించిన ఉత్తమ సిబ్బందికి ప్రభుత్వం అందించిన సేవా పతకాలను అందజేశారు.

15-08-2026

article_58280337.webp
గ్రంథాలయాన్ని ప్రారంభించాలని వినతి

లక్షెట్టిపేట, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ప్రారంభించాలని కోరుతూ శని వారం భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో వెంకట్రావుపేట పంచాయతీ సెక్రెటరీ సింగతి వంశీకృష్ణకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పోటీ పరీక్షల నోటిఫికేషన్లు వస్తున్నందున గ్రంథాలయాన్ని త్వరగా ప్రారంభించాలని, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి, పోలీస్ అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీజేపీ గ్రామ కమిటీ అధ్యక్షులు వెన్న అంజి, నాయకులు కాండ్రపు వంశీకృష్ణ, ఇండ్ల గంగన్న, జాడి కిషన్, కోన నరేష్, జాడి దేవేందర్, కోన హరీష్, సిల్వేరి సాయికిరణ్, బండి సంజీవ్, తదితరులున్నారు.

15-08-2026

article_28356453.webp
ఘనంగా 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

లక్షెట్టిపేట, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దిలీప్ కుమార్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, వందేమాతరం గీతాలాపన అనంతరం జనగణమనతో జెండా వందనం చేశారు. అదే విధంగా మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్ పర్సన్ దొంత అంజలి, పోలీస్ స్టేషన్ లో సీఐ రమణ మూర్తి, న్యాయస్థానంలో న్యాయమూర్తి సాయి కిరణ్, ఐకేపీ కార్యాలయంలో ఏపీఏం భూమక్క, వ్యవసాయాధికారి కార్యాలయంలో ఏఓ శ్రీకాంత్, ఏంపీడీఓ కార్యాలయంలో మధుసూదన్, ఏంఈఓ శైలజ, డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ సంతోష్ మహాత్మ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, ఐక్య వ్యాపార సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు మైలారపు సుధాకర్, పలు గ్రామాల్లో సర్పంచ్ లు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఆయా ప్రధానోపాధ్యాయులు జెండా ఎగురవేసి వందనం చేశారు. పట్టణంలో విద్యార్థులు నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

15-08-2026

article_66746325.webp
ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

లక్షెట్టిపేట, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ భవన్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా బోనగిరి కుమార్, ప్రధాన కార్యదర్శిగా దూడ సందీప్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా చీకటి తిరుపతి, కోశాధికారిగా వొజ్జల(చింతల) శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా బోనగిరి మహేష్, ఉపాధ్యక్షులుగా కొండజీ శ్రీనివాస్, బోరె రమేష్, ప్రధాన సలహాదారులుగా నేరెళ్ల లక్ష్మీ రాజం, సలహాదారులుగా మల్యాల సంతోష్, పిట్టల రాకేష్, ప్రచార కార్యదర్శిగా చీకటి సాయి కిరణ్ లను ఎన్నుకున్నారు.

15-08-2026

article_83782855.webp
రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

భీమిని, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా భీమిని, మండలంలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అధికారులు, ప్రజా ప్రతినిధులు, మండల ప్రజలు పలు పార్టీ కార్యాలయాల్లో పతాకావిష్కరణ ఘనంగా నిర్వహించారు. భీమినిలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో రమేష్, తహశీల్దార్ భికర్ణదాస్, పీహెచ్సీలో వైద్యురాలు నిర్మల, వ్యవసాయ శాఖలో ఏఓ రజిత, జిల్లా పరిషత్ పాఠశాలలో ఎంఈఓ వెంకటస్వామి, పోలీస్ స్టేషన్ లో ఎస్సై కోటేశ్వర్, పశు వైద్యశాల లో వైద్యుడు దిలీప్, ఐకెపి ఏపిఎం బ్రహ్మయ్య, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఎస్ ఓ దివ్య, గ్రంథాలయంలో సంఘర్స్ రామారావు, ఆయా గ్రామ పంచాయతీలలో సర్పంచులు, వివిధ పార్టీ కార్యాలయాల్లో మండల అధ్యక్షులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంఘర్స్ రవీందర్రావు, డిప్యూటీ తహశీల్దార్ గోవర్ధన్, ఆర్ ఐ కిషన్, సూపరింటెండెంట్ వేణుగోపాల్, సీనియర్ జూనియర్, అసిస్టెంట్లు ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ మండల అధ్యక్షులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

15-08-2026

article_50019344.webp
చెన్నూర్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

చెన్నూర్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శని వారం ఘనంగా నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మిక సంఘాల నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మున్సిఫ్ కోర్టులో జడ్జి పర్వతపు రవి, పోలీస్ స్టేషన్ లో సీఐ బన్సీలాల్, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ మహేష్ ప్రసాద్ తివారీ, మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మోహన్ లు జాతీయజెండా ను ఆవిష్కరించాగా, క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలర్ మంత్రి లక్ష్మణ్, అంబేద్కర్ చౌక్ లో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు తగరం వెంకటి, జ్యోతి బాపురావ్ పూలే విగ్రహం వద్ద బీజేపీ చెన్నూర్ నియోజకవర్గ ఇంచార్జ్ దుర్గం అశోక్, ఆర్యవైశ్య సంఘ భవనంలో సంఘ మండల అధ్యక్షుడు చిలువేరు మల్లిక్, సిపిఐ కార్యాలయంలో సిపిఐ మండల కార్యదర్శి నేన్నెల సమ్మయ్య, ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, కళాశాలల్లో ఆయా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్ జెండాలు ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.

15-08-2026

article_19636104.webp
బెల్లంపల్లిలో కన్నుల పండువగా పంద్రాగస్టు వేడుకలు

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణం లో స్వాతంత్ర్య వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వాడవాడల త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. ప్రభుత్వ కార్యాయలు,విద్య సంస్థల సముదాయాల వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు వద్ద న్యాయమూర్తి శాంతిసోని, మునిసిపల్ కార్యాలయం వద్ద చైర్ పర్సన్ దావస్వాతి, సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద మనోజ్, తహసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ కృష్ణ, స్టేట్ బ్యాంక్ వద్ద ఆటో యూనియన్ వద్ద రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

15-08-2026