ధర్మల్ కేంద్రాల వద్ద బిఆర్ఎస్ నేతల నిరసనలు
- బొగ్గు నెలలు లేవు....
- నాసిరకం బొగ్గు సరఫరా..
- పూర్తిస్థాయిలో జరగని విద్యుత్ ఉత్పత్తి
- ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు గడ్డుకాలం
- రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): గృహ వ్యవసాయ పరిశ్రమల అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) పూర్తిగా విఫలమైందని బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర(BRS Rajya Sabha member Vaddiraju Ravichandra) ఆరోపించారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం జిల్లాలోని ధర్మల్ పవర్ స్టేషన్లు, సింగరేణి ప్రధాన కార్యాలయాల వద్ద బి నాయకుల సందర్శన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ ను రాజ్యసభ సభ ఫ్లోర్ లీడర్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బృందం, కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ,శంబిపూర్ రాజు సందర్శించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్మాగాల సందర్శనానికి పోలీసులు అనుమతించకపోవడంతో కొద్దిసేపు పోలీసులకు బిఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.
అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా కేటీపీఎస్, బి టి పి ఎస్ కర్మాగారాల వద్ద ధర్నాలు నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కేటీపీఎస్ ను సందర్శించిన అనంతరం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ధర్మల్ పవర్ స్టేషన్లలో విద్యుత్ ఉత్పత్తి కి సరిపడా బొగ్గు నిల్వలు లేవని, ఒక్కొక్క కరమాగారంలో 21 రోజుకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉండగా, కేవలం ఒకటి రెండు రోజులు సరిపడా బొగ్గు మాత్రమే ఉందని, కర్మాగారాలకు సరఫరా చేసే బొగ్గు నాణ్యతలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఉత్పత్తిలో అగ్రభాగంలో నిలిచిందనే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత థర్మల్ పవర్ స్టేషన్లో నిర్వహణ ప్రశ్నార్ధకంగా మారిందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు,గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్, పట్టణ అధ్యక్షులు రాజు గౌడ్, మున్సిపల్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
మీడియాకు అనుమతి లేదు. ఆందోళన చేసిన మీడియా మిత్రులు
బిఆర్ఎస్ నాయకులు కేటీపీఎస్ సందర్శన సందర్భంగా మీడియాను కర్మాగారంలోకి అనుమతించకపోవడం శోచనీయం. అధికారుల తీరును వ్యతిరేకిస్తూ కర్మాగారం వద్ద మీడియా మిత్రులు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు.