5 September, 2026 | 11:34 PM

కాంగ్రెస్ అంటేనే... మోసం

05-09-2026 | 09:52pm

- ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, సబితారెడ్డి 

ఎల్బీనగర్: కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం.. అని, అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను నట్టేట ముంచే పార్టీ అని ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, సబితారెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) దిశానిర్దేశం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలను, యువతకు ఇచ్చిన 420 హామీల అమలులో జరిగిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, సబితారెడ్డి ఆధ్వర్యంలో శనివారం “విద్యార్థి, యువ పోరుబాట” కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎల్బీనగర్ నియోజకవర్గం(LB Nagar Constituency)లో గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని వీవీ నగర్ బస్ స్టాప్ నుంచి దిల్ సుఖ్ నగర్ ప్రధాన రహదారి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే సబితారెడ్డి(MLA Sabitha Reddy) ఆధ్వర్యంలో కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయం కమాన్ నుంచి ఎల్బీనగర్ చిత్ర లేఔట్ వరకు 2 వేల మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. జీవో 97ని రద్దు చేయాలని అసెంబ్లీలో మాట్లాడాలని పాలిటెక్నిక్ విద్యార్థులు వినతి పత్రం అందజేశారు.

ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. విద్యార్థులు, యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని,యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్లు భవాని ప్రవీణ్ కుమార్, సాగర్ రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్ నాయకులు బిచేనేపల్లి వెంకటేశ్వరరావు, శ్రీశైలం యాదవ్, రమణారెడ్డి, శైలజ, విజయ, గండి సన్ని యాదవ్, మురుకుంట్ల అరవింద్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు