హామీల అమలు చేయాలని బీఆర్ఎస్ వినతిపత్రం
చెన్నూర్,(విజయక్రాంతి): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్(BRS) నాయకులు సోమవారం ప్రజావాణిలో మంచిర్యాల జిల్లా(Mancherial District) చెన్నూర్ ఎంపిడిఓ మోహన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు వాగ్దానం చేసిన హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ మోతె తిరుపతి, చెన్నూర్ మాజీ మండల అధ్యక్షుడు మంత్రి బాపు, సీనియర్ నాయకులు రుద్రభట్ల సంతోష్, ఏలేశ్వరం నరసింహా చారీ, వేముల మహేంధర్, తదితరులు పాల్గొన్నారు.
