6 September, 2026 | 4:59 PM

Breaking News

ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్‌ఎస్‌ నిరసన

06-09-2026 | 03:25pm

పటాన్‌చెరు లో ఉధృతమైన ప్రజా పోరాటం

పటాన్‌చెరు, సెప్టెంబర్ 6: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో పటాన్‌చెరు నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే జిఎంఆర్, బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ ఆదర్శ్‌ రెడ్డి హాజరయ్యారు. బీహెచ్‌ఈఎల్‌ చౌరస్తా నుంచి ఇస్నాపూర్‌ చౌరస్తా వరకు తాగునీరు, వీధి దీపాలు, శాంతి భద్రతలు, బస్తీ దవాఖానాల ఏర్పాటు వంటి ప్రజల మౌలిక అవసరాలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆటోల ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలను కల్పించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని నాయకులు విమర్శించారు.

అనంతరం ఇస్నాపూర్‌ మున్సిపల్‌(Isnapur Municipality) కేంద్రంలో మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్‌ కిట్‌, కల్యాణ లక్ష్మి, విద్యార్థులకు స్కూటీలు, అలాగే దివ్యాంగులకు పెన్షన్లు అందిస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళలు, దివ్యాంగులు, విద్యార్థులు, పేదలు సహా అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమాల్లో పటాన్‌చెరు(Patancheru) నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు, దివ్యాంగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు