హామీలు అమలు చేయాలని బీఆర్‌ఎస్ నిరసన

08-09-2026 | 04:35am

బూర్గంపాడు, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు సోమవారం నిరసన చేపట్టాయి. బీఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి, అనంతరం ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత(Former ZPTC Kamireddy Srilatha) మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500, బీడీ కార్మికులకు రూ.4 వేల పెన్షన్, వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద ఆర్థికసాయంతో పాటు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు, నిరుద్యోగ భృతి తదితర హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ భూపెల్లి నర్సింహారావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, నాయకులు కొనకంచి శ్రీను, దారం కృష్ణారెడ్డి, గోనెల నాని, సాదిక్పాషా, సోము లక్ష్మిచైతన్యరెడ్డి, పూర్ణ, బెజ్జంకి కనకాచారి, గుల్మహ్మద్, బానోత్ శ్రీను, మోహన్, పంగి సురేష్, సర్పంచులు గుమ్మడి కృష్ణవేణి, బానోత్ సరోజ, రమణ, సాలయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు