రాజ్యాధికారం సంకల్ప సభను విజయవంతం చేయండి
03-10-2026 | 07:53pm
బోథ్,(విజయక్రాంతి): ఈనెల తొమ్మిది న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తొందరగానున్న రాజ్యాధికార సంకల్ప సభను విజయవంతం చేయాలని బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నపురం రమేష్ పిలుపునిచ్చారు. సభకు సంబంధించిన వాల్పోస్టర్లను సోనాల మండల కేంద్రంలో విడుదల చేశారు.. గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు బిఎస్పి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. సమావేశంలో అసెంబ్లీ అధ్యక్షులు మిట్టే ప్రదీప్ సీనియర్ నాయకులు శ్రీహరి తదితరులు ఉన్నారు.