పెదవీడులో డీజే సీజ్..కేసు నమోదు

27-09-2026 | 12:21pm

మఠంపల్లి సెప్టెంబర్ 27(విజయ క్రాంతి): మఠంపల్లి(Mathampalli) మండలం పెదవీడులో గణేశ్ నిమజ్జన(Ganesh Immersion) శోభాయాత్ర సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ అధిక శబ్దంతో డీజే వినియోగించడంతో పోలీసులు పరికరాలను సీజ్ చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసుల సూచనలు పాటించకుండా డీజే వినియోగించడంతో పాటు బాణసంచా కాల్చడం,పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.


మరిన్ని వార్తలు