కనుకునూరులో సీసీ రోడ్డు ప్రారంభం
17-09-2026 | 04:47pm
మహా ముత్తారం సెప్టెంబర్ 17( విజయ క్రాంతి): మహా ముత్తారం(Maha Muttaram) మండలం ఉపాధి హామీ పథకం కింద మహా ముత్తారం మండలం కనుకునూరు గ్రామానికి మంజూరైన రూ.5 లక్షల సీసీ రోడ్డు పనులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాడి రాజయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాడి రాజయ్య మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కనుకునూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణంతో ప్రజల రాకపోకలకు సౌకర్యం కలగడంతో పాటు, వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు.