జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్

17-09-2026 | 10:28pm

జిన్నారం, సెప్టెంబర్ 17: జిన్నారం, గడ్డపోతారంలోని మున్సిపల్ ఆవరణలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని(Telangana Praja Palana Day) పురస్కరించుకొని గురువారం జాతీయ పతాకాన్ని మున్సిపల్ చైర్మన్ సుష్మ, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, కమిషనర్ తాన్య ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఆనాటి మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణమన్నారు. ఈ వేడుకల్లో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు