ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 10న ఛలో హైదరాబాద్
మేడ్చల్, సెప్టెంబర్ 5 (విజయ క్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో (Under the aegis of TGEJAC) 10న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కలెక్టరేట్‌కార్యాలయంలో ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ సం దర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ చైర్మన్ రవి ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి వినోద్, అదనపు ప్రధాన కార్యదర్శి వై. రామేశ్వర్ గౌడ్, కోచైర్మన్ బి. వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్లు చ. ఆనంద్ రెడ్డి, విఠల్, మదన్ రెడ్డి, రాజు, అలాగే పీఆర్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి చ. ఆ నంద్ రెడ్డి, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి విఠల్ పాల్గొన్నారు.
అదేవిధంగా టీఎన్జీవోస్ కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు కార్తీక్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య అధికారి డా. ఆనంద్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోకార్యదర్శి భరత్ కుమార్, కోశాధికారి శేష సాయి గిరికాంత్, మహిళా సంయుక్త కార్యదర్శి కె. అశ్విని, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు కార్తిక్, కార్యదర్శి ఎల్. అక్షయ్ కుమార్ తో పాటు నాగరాజ్ అబ్రహాం ఉమాకాంత్, కిషోర్, శివ తదితరులు పాల్గొన్నారు.






