6 September, 2026 | 7:14 AM

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో.. గెలుపు మాదే!

06-09-2026 | 05:50am

చూస్కుందాం.. కేసీఆర్

కాస్కోండి.. కల్వకుంట్ల కుటుంబమా!

ఉన్న సీట్లు ఉంటే 90.. 

సీట్లు పెరిగితే 117 గెలుస్తాం

  1. ఈ నెలాఖరుకు సిరిసిల్ల వెళ్తాం.. వచ్చేనెల సిద్దిపేటపై దండయాత్ర 
  2. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. లేదంటే ఎమ్మెల్యే వదవికి రాజీనామా చేయాలి 
  3. గజ్వేల్‌లోనే తేల్చుకుందాం 
  4. నాకు చదువు లేకపోయినా సంస్కారం ఉంది..
  5.  కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు పదవులిచ్చారు..
  6. మా ప్రభుత్వం ఉద్యమకారుల పిల్లలకు పదవులిచ్చింది
  7. నకిరేకల్ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
  8. తెలంగాణ తులసివనంలో బీఆర్‌ఎస్ గంజాయి మొక్క.. పీకేస్తాం!
  9. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన-.. వెయ్యి రోజుల మా పాలనను పోల్చిచూడాలి

* కేసీఆర్(Kalvakuntla Taraka Rama Rao) ఇప్పటివరకు 22 కోట్ల 24 లక్షల 48 వేల రూపాయలు జీతం తీసుకున్నాడు. ప్రభుత్వపరంగా అన్ని సౌకర్యాలు పొందుతున్నప్పుడు అసెంబ్లీకి ఎందుకు రాడు. ఇది ఎవరి అబ్బ సొమ్మని..!.. వస్తే అసెంబ్లీకి రా.. లేదంటే గౌరవంగా రాజీనామా చేయాలి. అక్రమంగా దోచుకున్న సొమ్ములో చెల్లికి వాటా ఇవ్వాల్సి వస్తుందని కేటీఆర్ రాఖీ కట్టించుకోలేదన్నారు. నాకు సీతక్క(Seethakka), సురేఖమ్మ(Surekhamma) రాఖీ కడితే ఆడబిడ్డలుగా స్వీట్ ఇచ్చి, చీర పెట్టా.. ఇది నాకున్న సంస్కారం.

 సీఎం రేవంత్‌రెడ్డి

నల్లగొండ బ్యూరో, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్(BRS) అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ముంచి గద్దె దిగిపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రజా ప్రభుత్వాన్ని విమ ర్శిస్తున్న వారి చరిత్రను ప్రజలు గమనించాలని కోరారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో వివిధ అభివృద్ధి పనుల(Development works)కు సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 100 పడకల ఆస్పత్రిని సీఎం ప్రారంభించారు.

అనంతరం పట్టణంలోని రాజీవ్ గాంధీ మినీ స్టేడియం(Rajiv Gandhi Mini Stadium)లో ఏర్పాటుచేసిన వెయ్యి రోజుల ప్రగతి పాలన సభ(Governance and Progress Meeting)లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతల(BRS leaders)పై నిప్పులుచేరిగారు. తెలంగాణ(Telangana) తులసి వనంలో ఉన్న బీఆర్‌ఎస్ గంజాయి మొక్కలను పీకేస్తామని, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన.. వెయ్యి రోజుల ప్రజాపాలనను పోల్చిచూస్తే ఎంత అభివృద్ధి చేశామో స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.

దద్దమ్మలు సన్నాసులు ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అంటున్నారని దుయ్యబట్టారు. వెయ్యి రోజుల పా లనపై బావాబామ్మర్దులు రోడ్లపై తిరుగుతూ ఆరాటపడుతున్నారని ఎద్దవా చేశారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) పాలన మళ్లీరావాలని ఆయన కుటుం బం కోరుకుంటున్నది. పదేళ్ల పాలలో కు టుంబం అంతా దోచుకుందని, వారి కుటుం బ సభ్యులకు పదవులు ఇచ్చారన్నారు. 

రైతులకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి 

గతంలో బీఆర్‌ఎస్ రైతుల(Farmers)కు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది అన్నా రు.  2014లో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు దఫాలుగా చేస్తే అది మిత్తిలకే సరిపోను అసలు అలాగే మిగిలిపోయిందని సీఎం అన్నారు. 2018ల మరోసారి అవకాశం ఇస్తే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు ను అమ్మి వేల కోట్లు అక్రమంగా సంపాదించారన్నారు. ఎన్నికల కమిషన్ ను అడ్డం పెట్టుకొని రైతులను ముంచారని చెప్పారు.

రైతు సంక్షేమానికి వేల కోట్లు 

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమానికి వేలకోట్లు కేటాయిస్తుందన్నారు. దీనిలో భాగంగా 25 లక్షల 35 వేల మంది రైతులకు 25,617 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వాన్నిదన్నారు. ఈ విషయం గురించి చర్చి ంచడానికి సిద్దిపేట గడ్డైన, సిరిసిల్ల అడ్డా అ యినా సిద్ధమేనన్నారు.  32 నెలల్లో 36 వేల కోట్ల రూపాయలను రైతులకు బదిలీ చేసిన చరిత్ర ఈ ప్రభుత్వానికి ఉందన్నారు దీనిపై అసెంబ్లీలో చర్చించడానికి సైతం సిద్ధమన్నారు.

రైతులకు గిట్టుబాటు ధర, రైతు బీమా, రైతు భరోసా, సన్నధాన్యానికి 500 బోనస్ లను అందించామన్నారు. ప్రభుత్వం సన్నిధాన్యమును కొనుగోలు చేసి 90 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో వేశామన్నారు. అయినా మామ అల్లుడు, తండ్రి కొడుకు కలిసి ప్రభుత్వంపై నోటికి వచ్చిన విమర్శలు చేస్తున్నారన్నారు. కానీ రైతు మే లు కోసం చేసిన పనులకు అసెంబ్లీలో చ ర్చించడానికి రావాలని సవాల్ విసిరారు.

మహిళల ఉచిత ప్రయాణానికి 11 వేల కోట్లు 

 డిసెంబర్ 7, 2023న అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ఆనాడే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిందన్నారు. ఈ పథకం ద్వారా మహిళలు అమ్మవారి ఇంటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించాలన్న.. యాదా ద్రి లక్ష్మీ నరసింహ స్వామిని, భద్రాద్రి రా మున్ని దర్శించుకోవాలంటే ఉచితంగా ప్ర యాణం చేస్తున్నారన్నారు. ఇందుకోసం ప్ర భుత్వం ఆర్టీసీకి 11 వేల కోట్ల రూపాయలను చెల్లించిందన్నారు.

ప్రతి మహిళ నెలకు సు మారు పదివేల రూపాయలను ఉచిత ప్ర యాణం ద్వారా ఖర్చులు తగ్గించుకోగలుగుతుందన్నారు. ఆటో కార్మికులను రెచ్చగొట్టి ఈ ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయాలనీ టిఆర్‌ఎస్ నాయకులు పూనుకున్నారని కానీ మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం సూర్యు డు ఉదయించినంతవరకు.. చంద్రుడు కనిపించినంత వరకు మహిళలకు ఉచిత ప్ర యాణం కొనసాగుతుందన్నారు.

మహిళా సాధికారతకు ప్రాధాన్యత : మహిళలు సాధికారతను సాధించేందుకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. దీనిలో భాగం గా వారికి 1000 బస్సులను అందించి వా రిని యజమానులుగా మార్చి సంపాదించుకునే అవకాశాలు కల్పించామన్నారు. సోలా ర్, పెట్రోల్ బంకులను ఆడబిడ్డలతో ఏర్పా టు చేయించి వారితో వ్యాపారం చేస్తూ నెల కు 5 6 లక్షల వరకు సంపాదించుకునేందుకు అవకాశం కల్పించామన్నారు.

అలాగే హైటెక్ సిటీలో విప్రో వంటి కార్పొరేట్ సంస్థలు కార్యాలయాలు ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతంలో శిల్పా రామం ఆనుకొని మూడున్నర ఎకరాల భూమిని కేటాయించి ఇందిరా మహిళా శక్తి ఇష్టాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 30 నెలల్లో మహిళలకు 60 వేల కోట్ల నగదు ఇచ్చినట్టు తెలిపారు.

2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వారికి ప్రభుత్వ కార్యాలయా ల్లో క్యాంటిన్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ, పాఠశాలల్లో బట్టలు కుట్టే అవకాశం కల్పించామన్నారు. ఇవేమీ చేయని గత ప్రభుత్వం మహిళలకు ఏదో చేసినట్లు చెబుతున్నానని సీఎం దుయ్యబట్టారు. 

 ప్రశ్నపత్రాలు పల్లీ బఠాణీల్లా: 

 గత ప్రభుత్వ హాయంలో ప్రశ్నాపత్రాలను పల్లి బఠానీల అమ్ముకున్నారని విమర్శి ంచారు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుం టూ వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మొదటి సం వత్సరంలోనే 72 వేల ఉద్యోగాలు ఇచ్చామ ని, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కానీ బీఆర్‌ఎస్ నాయకులు మాత్రం ప్రజా పా లన పోవాలి.. పాపాల భైరవుడు రావాలి అ ని ఒకటే రాగం ఎత్తుకుంటున్నారన్నారు.

అధికారంలోకి వచ్చాక సమన్యాయం పా టించామని.. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు, పొన్నం, సీతక్కలు మంత్రులు, చామల కిరణ్ రెడ్డి, రఘువీర్ రెడ్డిలు ఎంపీ లు, శంకర్ నాయక్, నెల్లి సత్యం,అద్దంకి దయాకర్ లు ఎమ్మెల్సీలు అయ్యారన్నారు. 1200 మంది తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటే వారికి ఏమి చేశారో కేసీఆర్ చెప్పాలన్నారు.

మలిదశ ఉద్యమం లో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు చేసిన న్యాయం ఏంటో చెప్పాల న్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వా త ఆమెకు, చాకలి ఐలమ్మ మనవరాలుకి సముచిత స్థానం కల్పించి గౌరవించానన్నారు. కేసీఆర్ తన కుటుంబానిక పదవులి స్తే, తమ ప్రభుత్వం ఉద్యమకారుల పిల్లలకు పదవులిచ్చిందని చెప్పారు.

కేసీఆర్ బంధువులకే పదవులు

కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అల్లుడు కుమారుడులకు మంత్రి పదవులు, బిడ్డకు ఎమ్మెల్సీ, సంతోష్ రావుకు ఎంపీ, ఎర్రబెల్లి వినోద్ కుమార్ లతో పాటు వారి బంధువులకే పదవులు దక్కాయన్నారు. అలాగే చూడడానికి టీవీ, రాసుకోవడానికి పేపర్, ఉండడానికి ఫామ్ హౌస్, దోచుకోవడానికి తెలంగాణ రాష్ట్రంను చేతిలోకి తీసు కున్నారన్నారు. కానీ ప్రజా పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి జరిగిందన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారధ్యంలో ఒక కోటి ఆరు లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వడం తో పాటు మూడు కోట్ల 48 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. 

బద్మాష్ బరితెగించి మాట్లాడుతుండు 

సొంత చెల్లిని రాఖీ కట్టడానికి రానివ్వని బద్మాష్ బరితెగించి మాట్లాడుతుండని విమర్శించారు. చదువు రాదు అని అన్నాడట. నా కు సంస్కారం ఉందన్నారు. రాఖీ పండక్కు ఆడబిడ్డలను గౌరవించాలి కానీ ఆస్తిలో వా టా ఇవ్వాల్సి వస్తుందని ఆమెను మెడపట్టి బయటకి నెట్టిన నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు,  గాడిదా నాకు చెప్పేది అని ప్రశ్నిం చారు. నాలుగు ఇంగ్లీషు ముక్కలు వస్తే తన కు అన్నీ తెలిసినట్టు ప్రవర్తిస్తున్నాడన్నారు.

‘నమ్మితిరా సిద్ధ అంటే పెడితీరా సున్నం’ అన్నట్టు వ్యవహరిస్తున్నాడన్నారు. గంజాయి కొట్టి పండేటోడు నీతులు చెప్పడం సరికాదన్నారు. మాట్లాడడం ఆయన వల్ల కాదని, వాళ్ళ అయ్యను బావను బంధువులను ఇం కెవరినైనా తీసుకువచ్చి మాట్లాడించాలన్నా రు. ఇంటి ఆడబిడ్డనే సరిగా చూసుకో లేనో డు కోటి మంది ఆడబిడ్డలను బాగు చేస్తా డా.. అర్థం చేసుకోవాలని రేవంత్‌రెడ్డి అన్నారు.     

శాసనసభకు రా.. లేకుంటే రాజీనామా చేయి 

కేసీఆర్ ఇప్పటివరకు 22 కోట్ల 24 లక్షల రూపాయల 48 వేలు జీతం తీసుకున్నాడని, ప్రభుత్వపరంగా అన్ని సౌకర్యాలు పొందుతున్నప్పుడు అసెంబ్లీకి ఎందుకు రాడని ప్రశ్నించాడు. ఇది ఎవరి అబ్బ సొమ్మని... వస్తే అసెంబ్లీకి రా లేదంటే గౌరవంగా రాజీనామా చేయాలని సవాల్ చేశారు. అక్రమం గా దోచుకున్న సొమ్ములో చెల్లికి వాటా ఇ వ్వాల్సి వస్తుందని రాఖీ కట్టించుకోలేదన్నా రు. నాకు సీతక్క, సురేఖలు రాఖీ కడితే ఆడబిడ్డగా స్వీట్ పెట్టి చీర పెట్టానని ఇది నాకున్న సంస్కారం అన్నారు.

2029లో గెలిచేది కాంగ్రెస్సే..

2029లో జరిగే ఎన్నికల్లో గెలవబోయేది కాంగ్రెస్సేన అన్నారు. ఇవే సీట్లు అయితే 90, పెరిగితే 117 సీట్లతో అధికారంలోకి రా వడం ఖాయమన్నారు.2034 వరకు ఇందిరమ్మ పాలన వస్తుందని అందుకు నకిరేకల్ సభని సాక్ష్యం అన్నారు. ఈ నెలాఖరుకు సిరిసిల్ల, వచ్చే నెలలో సిద్దిపేటకు దండయాత్ర గా వస్తామని అక్కడ ఈసారి కాంగ్రెస్ జెం డా ఎగరడం ఖాయమన్నారు. చూస్కుం దాం.. కేసీఆర్ అని సీఎం సవాల్ చేశారు.

మళ్లీ కాంగ్రెస్‌దే ప్రభుత్వం: మహేష్ కుమార్ గౌడ్

రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని 100 సీట్లలో విజయఢంకా మోగి స్తామని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజా పాలనలో విద్య వైద్యానికి పెద్ద పీట వేశారని, కేసీఆర్ అందెశ్రీ పాటను తొక్కి పెట్టాడని, గద్దర్ ను పట్టించుకోలేదని, రేవంత్ రెడ్డి గద్దర్ పేరిట అవార్డులు ఇచ్చాడని.. రెడ్డి బిడ్డ రేవంత్ రెడ్డి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాడని చెప్పారు.

ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేస్తాం.?: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

2028 జూన్ నాటికి ఎస్‌ఎల్బీసీ సొరంగాన్ని పూర్తిచేస్తామనీ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. డిండి ప్రాజెక్టుకి 1800 కోట్లు కేటాయించామని, పదేళ్ల పాలనలో బి వెల్లం ల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, పునాదిగాని కాలనీ పూర్తిచేస్తామని, మూసీ ప్రాజెక్టు నిండా నీళ్లు ఇస్తామ ని, ఎస్‌ఎల్బీసీ లైనింగ్ పనులు జరుగుతున్నాయి అన్నారు. అడిగిన వారందరికీ రేషన్ కారు ్డలు ఇచ్చామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా మారిందన్నారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడు తూ, పేదల పక్షాన ప్రజాపాలన కొనసాగుతుందని గత పదేళ్ల పాలనలో ఏమి జరగలే దన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రజాపాలనలో అమలు చేస్తున్నామని మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. విఫల పాలన అంటూ విమర్శలు చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలు.. నకిరేకల్ గడ్డమీద కొచ్చి జనాన్ని చూడాలని సవాల్ చేశారు.

పదేళ్లలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని, రేషన్ కార్డులు ఇవ్వలేదని అన్నా రు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాడు. లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తిచేయాలని వినతి పత్రం అం దజేశారు. సీఎం ఈ సందర్భంగా 345 కోట్ల 45 లక్షల విలువైన 12 పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. వంద పడ కల ఆసుపత్రిలో సౌకర్యాలను పరిశీలించా రు.

బహిరంగ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జయవీర్ రెడ్డి, బాలు నాయక్, మందుల సామెల్, బ త్తుల లక్ష్మారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మె ల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం, డిసిసి అధ్యక్షుడు పున్న కైలాస్ నేత, దుబ్బాక నరసింహరెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు

రాజగోపాల్ రెడ్డి రాకతో హర్షధ్వానాలు..

చేతులు కలిపిన చప్పట్లు

మనసులు కలిపిన ముచ్చట్లు

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సభకు హాజరుకావడంతో మంత్రి కోమటిరెడ్డి పనిఉందంటూ హైదరాబాద్ వెళ్లిపోవడంతో రాజకీయవర్గాల్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై చర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ తన ప్రసంగంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేర్లు ప్రస్తావించినప్పుడు సభకు వచ్చిన ప్రజలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. 

సభ సక్సెస్.. 

నకిరేకల్ సభ విజయవంతం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. అంచనాలకు మించి జనం తరలి రావడంతో సీఎం ప్రత్యేకంగా వీరేశం ను అభినందించారు. పీసీస రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సై తం జన సంద్రానికి మంత్రముగ్ధుడయ్యాడు. కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహం లో మునిగిపోయాయి.

మరిన్ని వార్తలు