6 September, 2026 | 2:28 AM

కాంగ్రెస్ విద్యారంగాన్ని విస్మరించింది: ఆంజనేయ గౌడ్

06-09-2026 | 12:55am

గద్వాల్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ(Telangana Sports Authority) మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గద్వాలలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నడిగడ్డలో మెడికల్, నర్సింగ్, ఐటీఐ కళాశాలలు(ITI colleges), గురుకులాలు, స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేశారని అన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఇంచార్జ్ హనుమంతు నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, పలువురు నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు