రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
చేగుంట ఉప సర్పంచ్ రఫీ
శివంపేట్ అక్టోబర్ 3 ( విజయక్రాంతి ) : చేగుంట మండలం(Chegunta Mandal) చందాయిపేట గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు సమీర్(Sameer) రోడ్డు ప్రమాదంలో(Road accident) అకాల మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. యువకుడి మృతి పట్ల చేగుంట గ్రామ ఉప సర్పంచ్ రఫీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే బాధిత కుటుంబాన్ని శివంపేట్ మండలం శభాష్ పల్లి గ్రామం మృతుడి అమ్మమ్మ నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి తన సొంత నిధుల నుండి రూ. 5,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. అంత్యక్రియలకు, కుటుంబ అవసరాలకు ఈ సాయం ఉపయోగపడుతుందని తెలిపారు. మృతుని కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, ప్రభుత్వం నుండి రావాల్సిన సహాయం అందేలా కృషి చేస్తామని ఉప సర్పంచ్ రఫీ హామీ ఇచ్చారు.