తోపుకుంట నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన చీఫ్ ఇంజనీర్..
22-09-2026 | 08:09pm
ములుగు, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ములుగు సర్కిల్ నోడల్ ఆఫీసర్, చీఫ్ ఇంజనీర్ కే గౌతమ్ రెడ్డి (Chief Engineer K. Gautham Reddy)మంగళవారం ములుగులో పర్యటించారు. ఈ సందర్భంగా ములుగులోని తోపుకుంట వినాయక విగ్రహాల నిమజ్జన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, శోభాయాత్ర, నిమజ్జనం సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, సిబ్బందికి సూచించారు. అనంతరం కూరగాయల మార్కెట్ సమీపంలోని వినాయక మండపాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఆపరేషన్ ఎస్ఈ బిక్షపతి, ఆపరేషన్ డిఇ కన్న రాజు, ఏఈలు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.