అంబేద్కర్‌పై అనుచిత పోస్టులపై ఫిర్యాదు
నిర్మల్ ,సెప్టెంబర్ 22 ( విజయ క్రాంతి): భారత రాజ్యాంగ(Indian Constitution) నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై సామాజిక మాధ్యమంలో కించపరిచే విధంగా పోస్టులు పెట్టిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. పట్టణంలోని రామ్ నగర్ కాలనీకి చెందిన లశెట్టి నర్సయ్య అనే వ్యక్తి తన ఫేస్‌బుక్ ఖాతాలో అంబేద్కర్‌ను అవమానించేలా పోస్టులు పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ మాట్లాడుతూ.. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు చేయడం బాధాకరమన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా కించపరిచే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇందులో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంటోళ్ల వెంకటస్వామి, ఎలమల రాజేశ్వర్, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంతం గణేష్, పురుషోత్తం, రమేష్, లింగయ్య, హరీష్, ముత్తన్న, భూమేష్, రాములు, భూమయ్య, నితీష్, రవి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.