విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలి
- మేధో వైకల్యం కలిగిన విద్యార్థులకు సాయం
- ఇంటి వద్దే విద్యాబోధన అందించాలి
చుంచుపల్లి, సెప్టెంబర్ 30(విజయక్రాంతి ): చుంచుపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్(District Collector Ankit) బుధవారం విస్తృతంగా పర్యటించి, చుంచుపల్లి తండా ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చుంచుపల్లి తండా ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు, విద్యాబోధన, పాఠశాల పరిసరాల పరిశుభ్రత, మౌలిక వసతులను పరిశీలించారు.
విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యా ప్రగతిని, పాఠ్యాంశాలపై అవగాహనను తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతంపై ప్రత్యేక దృష్టి సారించి, పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, తాగునీరు, పారిశుధ్యం తదితర సదుపాయాలను వివరాలను అడిగి తెలుసుకున్నారు . పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కొనసాగిస్తూ విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా నాణ్యమైన విద్యాబోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.