ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
బైంసా, సెప్టెంబర్, (విజయ క్రాంతి): జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆదివారం బాసరలో పర్యటించిన నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్(Collector) భవేష్ మిశ్రా(Bhavesh Mishra) మిశ్రాఆదివారం పరిశీలించారు. వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్న వివరాలను అడిగి తెలుసుకుని ఏర్పాట్లు పక్కాగా చేయాలని చూపించారు. నేపథ్యంలో, పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సర్ ప్రక్రియ పరిశీలన
అనంతరం భైంసా తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తనిఖీ చేశారు. నోటీసుల జారీ, తదుపరి ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు అవసరమైన సమాచారం అందిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేసి పూర్తిస్థాయిలో సహకారం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమాల్లో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ ఈఈలు అనిల్, సుభాష్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, బాసర ఆలయ ఈఓ అంజనా దేవి, తహసీల్దార్లు పవన్ చంద్ర, శశి భూషణ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు






