సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ
మండలంలో జూలై 4వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు ఇతర కార్యక్రమాల సమన్వయంపై జిల్లా ఎస్పీ డి.జానకి పర్యటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పర్యటన ప్రాంతంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, వాహన పార్కింగ్, ప్రజల రాకపోకలు, అధికారుల సమన్వయం తదితర అంశాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
01-07-2026