ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్‌తో కలెక్టర్ భేటీ

24-09-2026 | 03:39pm

జ్యోతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, సెప్టెంబర్ 24(విజయ క్రాంతి) రామగుండంలోని జ్యోతిభవన్ అతిథి గృహంలో భారత జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్‌ను(Vaddepalli Ramachander) పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sriharsha) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్సీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, వారికి అందుతున్న సంక్షేమ పథకాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలిసింది.

ఎస్సీ వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సమర్థవంతంగా అందేలా అధికారులు కృషి చేయాల్సిన అవసరంపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు సమాచారం. జిల్లాలో సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

మరిన్ని వార్తలు