గ్రామస్తులు విజ్ఞప్తికి స్పందించిన కలెక్టర్

30-09-2026 | 04:21pm

బిజినేపల్లి, సెప్టెంబర్ 30 : - మండలంలోని ఖానాపూర్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థలో ఉందనే గ్రామస్తుల విజ్ఞప్తిపై జిల్లా  కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్(District Collector Hemanta Keshav Patil) సానుకూలంగా స్పందించి, పాఠశాలకు అదనపు తరగతి గదులను మంజూరు చేసేందుకు అవసరమైన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య, పాఠశాల అవసరాలు, అందుబాటులో ఉన్న స్థలాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం మండలంలోని ఖానాపూర్ గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ విద్యార్థుల సంఖ్య, తరగతుల వారీగా ఉన్న వివరాలు, పాఠశాలలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులపై ప్రధానోపాధ్యాయుడు రాజారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మునీరుద్దీన్, ఎంపీడీవో కథలప్ప, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజారెడ్డి, సంబంధిత అధికారులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు