గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌తో సమగ్ర ప్రగతి

08-09-2026 | 04:30am

సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ ౭ (విజయక్రాంతి): గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని, వాణి జ్య, పారిశ్రామిక, పర్యాటక రంగాలు కొత్త పుంతలు తొక్కుతాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా(CPI District Secretary S.K. Sabir Pasha) అన్నారు.

కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో గ్రీన్ఫీల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ముందస్తు సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ఎయిర్పోరట్స్ అథారిటీ ఆఫ్ ఇండి యా (ఏఏఐ) మల్టీ-డిసిప్లినరీ బృందం సోమవారం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా సుజాతనగర్, చుంచుపల్లి మండలాల్లోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాలను అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పరిశీలించింది.

ఏఏఐ బృందంతో కలిసి కొత్తగూ డెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సిపిఐ జిల్లా కార్యద ర్శి ఎస్.కె. సాబీర్ పాషా ప్రతిపాదిత భూములు, సరిహద్దులు, రవా ణా సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు, తొలుత పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు.

పరిశీలన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన కృషి ఫలించిందని అందులోభాగంగానే జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన గ్రీన్ఫీల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు దిశగా కేంద్ర సాంకేతిక బృందం రాక కీలకమైన అడుగని పేర్కొన్నారు. విమానాశ్రయ రాకతో మెరుగైన కనెక్టివిటీ, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయ్ కుమార్, దుర్గయ్య, శ్రీనివాస్, యూసుఫ్, సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు