కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలు
30-09-2026 | 09:05pm
రాజాపూర్: కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో పటిష్టం చేసేందుకే మండలంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల(Village committees)ను ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్ తెలిపారు. బుధవారం మండలంలోని కల్లేపల్లి, అగ్రహారం పొట్లపల్లి, గుండ్ల పొట్లపల్లి, పలుకు గుట్ట తండా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ(congress party) గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ నాయక్, భరత్ రెడ్డి, శంకరయ్య, గణేష్ నాయక్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.