26 లక్షల రూపాయలతో అభివృద్ధి పనుల ప్రారంభం
బోథ్ అక్టోబర్ 4 (విజయక్రాంతి): మండలం కేంద్రంలోని సాయి నగర్ కాలనీ(Sai Nagar Colony)లో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు మురికి కాలువల నిర్మాణం పనులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ పట్టణ సర్పంచ్ అన్నపూర్ణ ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ లు ప్రారంభించారు.
సాయి నగర్ కాలనీలో సీసీ రోడ్డుతో పాటు మురికాలువల నిర్మాణం పనులను 16 లక్షల రూపాయలతో చేపట్టినట్లు వారు తెలిపారు. మొత్తం పట్టణంలో 26 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేంద్ర మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మెరుగు భోజన్న, టీపీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కురుమే మహేందర్, సహకార సంఘం, సభ్యులు సట్ల ఉమేష్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అచ్యుత్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అబూద్, ఉపసర్పంచ్ విజయ రాజారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నరసింహ దాస్ నాయకులు కాలనీవాసులు గంగ మల్లు, లింగన్న, రాజు ,బుచ్చన్న, రాము, తదితరులు పాల్గొన్నారు.