తాతా మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన

09-09-2026 | 12:37pm

సిద్దిపేట రూరల్, సెప్టెంబర్ 9: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌(Speaker Gaddam Prasad)పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సిద్దిపేట రూరల్ మండల కాంగ్రెస్ నాయకులు రాఘవాపూర్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్‌రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు.

కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. స్పీకర్(Speaker) పదవి ప్రజాస్వామ్యానికి, శాసనసభ గౌరవానికి ప్రతీక అని, ఆ పదవిలో ఉన్న వ్యక్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అన్నారు. తాతా మధు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై దమ్ముంటే శాసనసభలో చర్చించాలని, చిల్లర రాజకీయాలకు పాల్పడటం సరికాదన్నారు.

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు గారిపల్లి రాములు, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు గ్యార రఘుపతి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొదాది రమేష్, బండి శివకుమార్, మహిపాల్‌రెడ్డి, పిట్ల వెంకటి, కంతుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు