చౌదరిగూడలో సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలి

30-09-2026 | 05:06pm

ఘట్ కేసర్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ (Pocharam Division)పరిధి, చౌదరిగూడ లోని పది కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి కి వినతిపత్రం అందజేశారు.

చౌదరిగూడలోని పలు కాలనీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిస్థాయిలో లేకపోవడంతో వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. కాలనీలలో అవసరమైన ప్రాంతాలను గుర్తించి నూతనంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను నిర్మించి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని డీసీ కి అందజేసిన వినతిపత్రంలో కోరారు. ప్రజల సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

ఈకార్యక్రమంలో ఘట్కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్, సిద్ధగొని రవిగౌడ్  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు