కట్టె గణపతికి పూజలు నిర్వహించిన సీపీ
ఆర్మూర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఆర్మూర్ మండలం(Armoor mandal) అంకాపూర్ గ్రామంలో లచ్చ గౌడ్, వీడీసీ ఫంక్షన్ హాల్లో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కట్టె గణపతి విగ్రహానికి పోలీస్ కమిషనర్ పీ.సాయి చైతన్య బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులతో మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రజల భద్రతకు పోలీస్ శాఖ అన్ని రకాల భద్రతా చర్యలు చేపడుతోందని, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కమీషనర్ తెలిపారు. గణేష్ ఉత్సవాలు సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలిచేలా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా పండుగను నిర్వహించుకోవాలని సూచించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఎస్ హెచ్ వో సత్యనారాయణ గౌడ్, అంకాపూర్ సర్పంచ్ దేవేందర్, బుర్రన్న, రాజన్న, రమణారెడ్డి, హిందూ సేవా సమితి సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.