సీఈసీ తీరుపై సీపీఎం విమర్శలు
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి. సిపిఎం.
సత్తుపల్లి,(విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. సీపీఎం(CPM) వి.ఎం. బంజర్ టౌన్ కార్యదర్శి చిట్టిమొదల కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఎం ఖమ్మం జిల్లా(Khammam district) కమిటీ సభ్యుడు చలమాల విఠల్రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చలమాల విఠల్రావు మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్(CEC Gyanesh Kumar) తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా, ఓటు హక్కుకు సంబంధించిన అంశాల్లో ఎన్నికల సంఘం(Election Commission) వ్యవహరిస్తున్న తీరుపై ఆయన విమర్శలు చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు వంటి అంశాలపై సమగ్రంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో సీపీఎం వి.ఎం. బంజర్ టౌన్ కార్యదర్శి చిట్టిమొదల కృష్ణ, సీపీఎం మండల కమిటీ సభ్యుడు నల్లమల అరుణ్ ప్రతాప్, సీఐటీయూ హమాలీ యూనియన్ నాయకులు మిద్దె స్వామి, మల్లెల వెంకటేశ్వరరావు, కలకోట అప్పారావు, నాగయ్య, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.