విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల శ్రద్ధ చూపాలి

02-10-2026 | 08:22pm

విబిఐటి సెక్రటరీడాక్టర్ జి. మనోహర్ రెడ్డి 

ఘట్ కేసర్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో గత 15 రోజులుగా జరుగుతున్న విభవ-26 స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్(Cricket Tournament) ముగింపు దశకు చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమానికి విబిఐటి సెక్రటరీ డాక్టర్ జి. మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేత క్రీడాకారులకు బహుమతులు, నగదును బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల మక్కువ చూపాలన్నారు. క్రీడలలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు తమ సొంతం అవుతుందన్నారు. ఈ టోర్నమెంట్ లో

మొత్తం 24 కళాశాలలకు చెందిన జట్లు పాల్గొన్నాయని, టోర్నమెంట్ చాలా బాగా జరిగిందని, ప్రతి మ్యాచ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బహుమతిని అందజేశామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివిఎస్ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ లు డాక్టర్ వైవిఎస్ఎస్ ప్రసాద్,  నరేష్, డాక్టర్ సతీష్, డాక్టర్ పోతలయ్య, భోగయ్య నాయుడు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీనివాసరెడ్డి, సహాయ పీడీలు శివలాల్, మహేష్, వెంకటేష్, శ్రవణ్ కుమార్, కేర్ టేకర్ రాములు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు