మున్సిపల్ లో అభివృద్ధి పనులు

24-09-2026 | 04:26pm

మున్సిపల్ చైర్మెన్ పద్మ శ్రీకాంత్ 

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 24(విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపాల్టీలోని(Yellareddy Municipality) కొత్తపల్లి గ్రామంలో  ఐదు లక్షల ఎస్ డి యాఫ్ నిధుల(SDF funds) ద్వారా గంగపుత్రుల సంఘభవనం భూమిపూజ మరియు కొత్తపల్లి లో హైమాక్స్ లైట్ల ఏర్పాటు  మున్సిపల్ నిధులతో ఏర్పాటు చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు.మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగానే  ఎమ్మెల్యే వెంటనే ఇట్టి పనులకు నిధులు మంజూరు చేసి తక్షణమే పనులు మొదలు పెట్టామని ఆదేశించడంతో వెంటనే పనులు మొదలయ్యాయి,

అని చైర్మెన్ పద్మ శ్రీకాంత్ అన్నారు.కొత్తపల్లి గంగపుత్రుల సంఘం సభ్యులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కు కృతజ్ఞతలు తెల్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జె జగ్జీవన్, మున్సిపల్ ఏ ఇ వినోద్, పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ మత్తమల ప్రశాంత్ గౌడ్,స్థానిక కౌన్సిలర్స్, కో ఆప్షన్ సభ్యులు,ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు