5 September, 2026 | 4:32 PM

శివాలయంలో భక్తుల పూజలు

05-09-2026 | 02:18pm

బెజ్జూర్ సెప్టెంబర్ 5 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల(Bejjur Mandal) కేంద్రంలోని శివాలయంలో శ్రావణమాసం పురస్కరించుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం పురస్కరించుకొని శివాలయంలో నిత్యభిషేకం ఆలయ ప్రధాన అర్చకులు గురు దత్ ఆధ్వర్యంలో అభిషేకం, అర్చన, అన్నభిషేకం శివలింగానికి ప్రత్యేక అలంకరణ చేసి రకరకాల పువ్వులతో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ రంగనాయక స్వామి(Ranganayaka Swamy), వీర హనుమాన్, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు, శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ రంగనాయక స్వామి ఆలయ ప్రాంగణంలో  ఇక్కామా(Iqama) (భక్తి పాటలతో భజన కార్యక్రమం) కార్యక్రమం 24 గంటల పాటు  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు తంగేడి పల్లి మహేష్, కనుకుట్ల వెంకటేష్ దంపతులు, కనుకుంట్ల శ్రీనివాస్ దంపతులు, శ్రీరామ చంద్రశేఖర్ దంపతులు, కోండ్ర నరేందర్ గౌడ్ దంపతులు, పడాల సదాశివ్ దంపతులు, పడాల గణేష్ దంపతులు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు