మౌలిక వసతులు సమకూర్చాలని డిమాండ్
ప్రభుత్వ ధరణి టౌన్షిప్ ప్లాట్
బాధితుల సమావేశం
కామారెడ్డి, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మౌలిక వసతులు సమకూర్చాలని ప్రభుత్వా ధరణి టౌన్షిప్(Dharani Township) ప్లాట్ యజమానుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి టౌన్షిప్ లో ప్లాట్లు కొనుగోలు చేసినప్పుడు మౌలిక వసతులు కల్పిస్తామని అప్పటి కలెక్టర్, తెల్పడంతో ప్లాట్లు కొనుగోలు చేసామని ప్లాట్ల యజమానులు తెలిపారు.
ప్లాట్లు కొనుగోలు చేసి నాలుగు సంవత్సరాలు అవుతున్న కనీస వసతులు ఏర్పాటు చేయలేదన్నారు. కామారెడ్డి గెలాక్సీ గార్డెన్ లో నిర్వహించిన సమావేశానికి ప్లాట్ల యజమానుల సంఘ అధ్యక్షులు పి.రాజ నర్సింహారెడ్డి(Association President P. Raja Narasimha Reddy) మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల క్రితం అప్పటి కలెక్టర్ సూచనల మేరకు ప్రభుత్వ వెంచర్ అని 357 మంది ప్లాట్లు కొనుగోలు చేశామని తెలిపారు. నాలుగు సంవత్సరాలు గడుస్తున్నప్పటి కి ని కనీస మౌలిక వసతులు నీరు, విద్యుత్ శక్తి, డ్రైనేజ్, రోడ్లు, పార్కు నిర్మాణాలు చేపట్టలేదు అన్నారు.
నివాసయోగ్యమైన కనీస వసతులు ఇప్పటివరకు కల్పించ లేదని,ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు బ్యాంకులలో లోన్ కట్టడం, సొంత ఇల్లు లేక బయట అద్దెలకు నివసిస్తున్నామని, సొంత ఇండ్లు లేక చాలా ఆర్థికంగా నష్టపోతు న్నా మనీ తెలిపారు, తక్షణమే ప్రభుత్వం కనీస వసతులు కల్పించినట్లయితే సొంత ఇల్లు నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, తక్షణమే ప్రభుత్వం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు కైలాస రాజేశ్వరరావు, ఉపాధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జే. జస్వంత్ రావు, కోశాధికారి , లక్ష్మీనారాయణ, లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి, శివ రాజయ్య, సలహాదారులు శ్రీధర్, కిషన్, శ్రీనివాస్ బాధిత సభ్యులు100 మంది పాల్గొన్నారు.