బుదేరా ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన డిఐఈఓ
19-09-2026 | 01:25pm
మునిపల్లి సెప్టెంబర్ 19(విజయక్రాంతి): మండల పరిధిలోని బుదేరా చౌరస్తా(Budera Crossroads)లో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల(Junior College)ను డిఐఈఓ సర్వంతోట శ్రీనివాస్ సందర్శించి తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని సూచించారు. అనంతరం డిఐఈఓగా బాధ్యతలు స్వీకరించిన సర్వంతోట శ్రీనివాసరావు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకు బృందం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, అధ్యాపకులు 711 రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముద్దం సిద్ధారెడ్డి, మారుతి, ఉదయ్ ప్రసాద్ ,కాట అబ్బయ్య , సంజయ్, రమేష్ సలావత్ రవికుమార్, అనుమహిత, శ్రావణ్ కుమార్, మన్నె రమేష్, జి కవిత, ఇదేంద్రనాథ్ తదితరులు ఉన్నారు.