డిసెంబర్లో ఐపీఎల్ 2027 మినీ వేలం?
19-09-2026 | 03:25pm
ముంబై: ఐపీఎల్(IPL) 2027 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం(Mini auction) డిసెంబర్ రెండో వారంలో జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 7 నుంచి 13 మధ్య వేలం నిర్వహించే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
గత మూడు సీజన్లుగా విదేశాల్లో నిర్వహించిన ఐపీఎల్ వేలం.. ఈసారి భారత్‌లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వేలం వేదికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్లో పెళ్లిళ్ల సీజన్ పీక్‌లో ఉండటంతో హోటళ్ల లభ్యతను బట్టి వేలం వేదికను ఖరారు చేయనున్నారు. వేదిక ఖరారైన తర్వాత వేలం తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.