వచ్చే 5వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలు

19-09-2026 | 03:21pm

సీపీ రష్మీ పెరుమాళ్            

సిద్దిపేట క్రైం, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) :  ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5వరకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ (Police Commissionerate) పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. కమిషనరేట్  పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాల నిర్వహణకు ముందస్తు అనుమతి పొందాలని సూచించారు. వివిధ కారణాల పేరిట బలవంతంగా విద్యాసంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజే సౌండ్ వినియోగంపై నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు