6 September, 2026 | 3:08 PM

పెద్దమల్లారెడ్డిలో ఇంటింటికీ బాకీ కార్డుల పంపిణీ

06-09-2026 | 01:03pm

భిక్కనూర్, సెప్టెంబర్‌ 6 (విజయక్రాంతి): కాంగ్రెస్‌ ప్రభుత్వ(Congress) 1000 రోజుల పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆదివారం పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఇంటింటికీ బాకీ కార్డుల(Baaki Card) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలుకు నోచుకోని పథకాలపై ప్రజలకు వివరిస్తూ బాకీ కార్డులను అందజేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కార్యక్రమం లక్ష్యమని బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు.

మరిన్ని వార్తలు