29 August, 2026 | 4:19 PM

సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం రద్దు

29-08-2026 03:49 PM

జనగామ, (విజయక్రాంతి): జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం (ఆగస్టు 31)న రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మహబూబాబాద్‌లో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించే జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు.

ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ వినతులు, ఫిర్యాదులతో సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని కలెక్టర్ కోరారు.  అయితే డివిజన్ స్థాయి, మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలు, వినతులను సంబంధిత డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాల్లో సమర్పించుకోవచ్చని సూచించారు.