టైగర్‌ జోన్‌పై ఆదివాసీల సమరం

24-10-2026 | 06:28pm

లక్షేట్టిపేట, అక్టోబర్ 24 ( విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట(Laksettipet)లో శనివారం  స్థానిక విశ్రాంతి భవనంలో  టైగర్ జోన్ బాధితుల పోరాట వేదిక ఆధ్వర్యంలో  రౌండ్ టేబుల్(Round Table) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు,  సామాజిక సంఘాల నాయకులు హాజరై మాట్లాడుతూ... కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం  అటవీ హక్కుల చట్టం అమలు చేయకుండా ఆదివాసి  పేదలను  టైగర్ జోన్ పేర్లతో పులుల సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం అంటూ ఆదివాసి  గ్రామాలను  ఖాళీ చేయించే కుట్ర చేస్తుందన్నారు.

అంతేకాకుండా గిరిజన గ్రామాలలో  కనీస సౌకర్యాలు కల్పించడం లేదని,అడవిపై ఆధారపడ్డ ఆదివాసిలు,  పేదలు ఉపాధి కోసం అడవిలోకి వెళ్ళనివ్వకుండా అటవీ అధికారులు ఆంక్షలు   పెట్టడం సరైంది కాదన్నారు. జిల్లాలో పట్టుపురుగుల  పెంపకం చేపట్టిన ఆదివాసి పేద రైతుల పంటలను నిర్ధాక్షణంగా అటవీ అధికారులు ధ్వంసం చేశారన్నారు.పశువులను మేకలను అడవిలో మేపుతున్న మేకల కాపర్లపై దాడి చేసిన అటవీశాఖ అధికారులు,  ఇలా ఆదివాసి పేదలపై అనునిత్యం అటవీ శాఖ అధికారులు ఆంక్షలు పెట్టడం , నిర్బంధం మోపడం ,  దాడులు చేయడం ఆపాలన్నారు.

ఆదివాసిలు పేదలు సాగు చేసుకుంటున్నా  పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. ప్రతి ఆదివాసీ  గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు  చేపట్టాలన్నారు. విద్య వైద్య ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో  సూర్పటేల్ , చిత్రు, కిష్ఠు, కనికరపు అశోక్, రెడ్దిమల్ల ప్రకాష్, ధమ్మా నారాయణ, మలేం చిన్నన్న, అవునూరి వెంకటేష్, ముల్కల్లా రాందాస్, సుధాకర్, గరిసే రవీందర్, తోగారి రాజు, సత్తన్న, రంజిత్ కుమార్,కళ్యాణం రవి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు