డిపిఓ అనూష పర్యటన
18-09-2026 | 10:51pm
అశ్వాపురం, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మొండికుంట గ్రామపంచాయతీ కార్యాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి అనూష(District Panchayat Officer Anusha) శుక్రవారం సందర్శించారు. పంచాయతీ రికార్డులను పరిశీలించి పారిశుద్ధ్య, అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం డంపింగ్ షెడ్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డిపిఓ అనూషను సర్పంచ్ మర్రి సంధ్య సన్మానించారు. అలాగే సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛ పాఠశాల–యువత కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు డంపింగ్ షెడ్‌లో తడి, పొడి చెత్తను వేరు చేసే విధానం, వర్మీ కంపోస్ట్ తయారీపై వివరించారు.