6 September, 2026 | 3:33 PM

ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం

06-09-2026 | 01:50pm

మద్దూర్, సెప్టెంబర్ 6(విజయ క్రాంతి): నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి(Nagireddipalli) గ్రామంలో ఆదివారం రోజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంచర్ల బాలయ్య ఇందిరమ్మ ఇళ్ళ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అండ దండాలతోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా వారి కళ నెరవేరింది. నిరుపేదల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. 

నిరుపేదలు ఎవరు ఉన్నా వారికి ఇందిరమ్మ ఇళ్ళ(Indiramma house)ను మంజూరు చేసి ఐదు లక్షల రూపాయలతో ఇంటిని కట్టించడం వారి గొప్పతనం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కవితా కృష్ణ, వార్డ్ మెంబర్స్ రాధిక మహేందర్, రామకృష్ణ, హనుమంతు, వెంకట్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు


మరిన్ని వార్తలు