2 July, 2026 | 5:08 PM

Breaking News

పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరు పాటించాలి: ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు   •   చర్చలకు పిలిచి అరెస్ట్ చేయించడం సిగ్గుచేటు   •   వైద్యులు తమ వృత్తిని సేవా భావంతో నిర్వహించాలి   •   పర్మిట్ రూమ్‌లో షాకింగ్ ఘటన.. వేయించిన పల్లీల్లో బొద్దింక   •   పోలీస్ సిబ్బందికి రివార్డులు   •   ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం   •   ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •   అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం   •   గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత   •  

Districts - Narayanpet

article_78543249.webp
మక్తల్​లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్‌ వద్ద మక్తల్–నారాయణపేట–కొడంగల్(Makthal–Narayanpet–Kodangal Lift Irrigation Scheme) ఎత్తిపోతల పథకం పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరిశీలించారు. మక్తల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం పర్యటిస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా మక్తల్ పర్యటన జరిగింది. ముఖ్యమంత్రి, మంత్రులు నీటి పారుదల ప్రాజెక్టులపై ఫొటో గ్యాలరీ వీక్షించారు. కాట్రేవుపల్లిలోని మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ఎత్తిపోతల పథకం ఫేజ్-1 పనులను రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఎత్తిపోతల పథకం ఫేజ్-1 లో భాగంగా పంప్ హౌస్, కెనాల్ పనులు జరుగుతున్నాయి. పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

04-06-2026