దుర్గాదేవి మండపం కర్ర పూజా

03-10-2026 | 10:40pm

శ్రీ వైష్ణవి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 

భక్తిశ్రద్ధలతో  పూజలు.. ఉత్సవాలకు శ్రీకారం

మేడిపల్లి, అక్టోబర్ 03 (విజయక్రాంతి): దసరా నవరాత్రి ఉత్సవాలను(Dasara Navaratri celebrations) పురస్కరిం చుకుని బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని దేవేందర్ నగర్ కాలనీలో శ్రీ వైష్ణవి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ దుర్గాదేవి మండపం కర్ర పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం యూత్ సభ్యులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా  నిర్వాహకులు మాట్లాడుతూ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను భక్తి,శ్రద్ధలతో నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో కుక్కల చంద్రయ్య, మరాటి మత్స్యగిరి, దయ్యల అలివేలు శ్రీ వైష్ణవి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కుక్కల రాజు,కుక్కల స్వామి, బిక్షపతి, సాయి కిరణ్, వినోద్, మహిళలు, యూత్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక యువత, భక్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు