బీటెక్ విద్యార్థులకు ఈడీ, సీఏడీ ల్యాబ్
18-09-2026 | 02:35pm
పాలమూరు యూనివర్సిటీ: పీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్(PU University College of Engineering)లో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థుల(students)కు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పూస రమేష్‌బాబు ఈడీ, సీఏడీ (ఇంజినీరింగ్ డ్రాయింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్) ల్యాబ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ డ్రాయింగ్‌లోని ప్రాథమిక అంశాలతో పాటు కంప్యూటర్ ఆధారిత డిజైన్ విధానాలను విద్యార్థులకు ప్రాక్టికల్‌గా వివరించారు. ఆధునిక ఇంజినీరింగ్ రంగంలో సీఏడీ సాఫ్ట్వేర్ ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులు సాంకేతిక, ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ల్యాబ్‌లో విద్యార్థుల సందేహాలను స్వయంగా నివృత్తి చేస్తూ డ్రాయింగ్, డిజైన్ అంశాలను సులభంగా వివరించారు. కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.