కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది విద్యార్థులు మృతి
త్రిస్సూర్: కేరళం త్రిస్సూర్ జిల్లాలో(Thrissur district) ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. కైపమంగళం(Kaipamangalam) పరిధిలోని పనంబికున్ను వద్ద తాము ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమిళనాడులోని (Tamil Nadu) దిండిగల్ కు చెందిన ఎనిమిది మంది ఇంజనీరింగ్ (Engineering) విద్యార్థులు మరణించారు.
శుక్రవారం రాత్రి సుమారు 11:40 గంటలకు గురువాయూర్ నుండి కొడుంగల్లూర్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఢీకొన్న తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను కారులోంచి వెలికితీశారు. ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థులు(Engineering students) మరణించడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.






